జగన్ పై లోకేశ్ న్యూ పంచ్

జగన్ పై లోకేశ్ న్యూ పంచ్

0
36

ఏడు నెలల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసి ఏడిపించడం తప్ప సాధించింది ఏమీ లేదని టీడీపీ నేత ఎమ్మెల్సీ నారాలోకేశ్ అభిప్రాయ పడ్డారు… రివర్స్ పాలనవల్ల సంక్షేమం, అభివృద్ధి అటకెక్కించారని ఆరోపించారు…

రాష్ట్రంలో ఉన్న సంక్షేమ కార్యక్రమాలను కూడా రద్దు చేసారని వాపోయారు లోకేశ్. పాదయాత్రలో హామీ ఇచ్చిన నవరత్నాలు అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కొక్కటిగా రాలిపోతున్నాయని మండిపడ్డాయి…

జగన్ మోహన్ రెడ్డిరివర్స్ పాలనలో రిజర్వుడు టెండరింగ్ ద్వారా సొంత మనుషులకు ప్రజాధనం దోపిడీని ఆపాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ఎదురుగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు లోకేశ్ . రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశంతో రివర్స్ లో నడిచి అసెంబ్లీకి వెళ్ళామని లోకేశ్ అన్నారు…