లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

0
75

ఆరు నెలలుగా రైతులను దగా చేస్తున్న అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరుకి నిరసనగా ఈరోజు అసెంబ్లీ ఎదుట నిరసన తెలిపామని మాజీ టీడీపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు…. గిట్టుబాటు ధర లేక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆయన మండిపడ్డారు.

ప్రభుత్వ అసమర్థ నిర్ణయాల వలన 260 మంది రైతులు వైసీపీ ఆరు నెలల పాలనలో ఆత్మహత్యలు చేసుకున్నారని లోకేశ్ ఆరోపించారు….

అయినా ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని లోకేశ్ మండిపడ్డారు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు..