40 రోజుల పాటు జై అమరావతి ఉద్యమంలో పాల్గొని రైతుల తరపున టీడీపీ నాయకుడు రంగిశెట్టి వెంకటేశ్వరరావు పోరాడి గుండెపోటుతో ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే… ఆయన మృతిపై టీడీపీ నేత లోకేశ్ స్పందించారు… ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు…
రంగిశెట్టి వెంకటేశ్వరరావు మరణం పార్టీకి తీరని లోటని లోకేశ్ అన్నారు.. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వారి ఇద్దరి పిల్లల చదువుకి పార్టీ తరపున సహాయం అందిస్తామని లోకేశ్ స్పష్టం చేశారు… ఈమేరకు లోకేశ్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ కూడా చేశారు..