నేటి మధ్యాహ్నం వైసీపీలోకి మంచు కుటుంబం

నేటి మధ్యాహ్నం వైసీపీలోకి మంచు కుటుంబం

0
113

ఇప్పుడు రాజకీయంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు పై అలాగే టీడీపీ ప్రభుత్వం పై విమర్శలు చేశారు.. అంతే కాదు తన కాలేజీ విధ్యార్దులకు చెల్లించాల్సిన ఫీజ్ రీయింబర్స్ మెంట్ విషయంలో నిలదీశారు ఆయన.. ఇక ఆయన తాజాగా వైసీపీలో చేరేందుకు సిద్దం అయ్యారు.. మరికాసేపట్లో ఆయన జగన్ ని కలిసి వైసీపీలో చేరుతున్నారు అని తెలుస్తోంది.. అయితే ఎన్నికల ముందే వైసీపీలో మంచు ఫ్యామిలీ లో చేరుతున్నారు అని వార్తలు వినిపించాయి, అంతేకాదు జగన్ వారికి శ్రీకాళహస్తి టికెట్ ఇస్తారు అని లేకపోతే తిరుపతి టికెట్ ఇస్తారు అని వార్తలు వచ్చాయి, అయితే ఆరునెలలుగా వార్తలు వచ్చాయి కాని వారు పార్టీలో చేరలేదు.

కాని ఇప్పుడు కొత్త వార్తలు వినిపిస్తున్నాయి..మోహన్ బాబు వైసీపీలో చేరి ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, కేవలం ప్రచారం మాత్రమే చేస్తారు అని అంటున్నారు. అయితే మోహన్ బాబు వైసీపీలో చేరితే పార్టీకి మరింత జోష్ అని చెబుతున్నారు నేతలు. అలాగే చిత్తూరు జిల్లాలో వైసీపీకి మంచి క్రేజ్ ఉంటుంది అని ఈ ఎన్నికల్లో కచ్చితంగా ఇది వైసీపికి ప్లస్ అవుతుంది అంటున్నారు విశ్లేషకులు, నేటి మధ్యాహ్నం ఆయన వైసీపీలో చేరి రేపటి నుంచి ప్రచారంలో పాల్గొంటారు అని తెలుస్తోంది.