మీకు అన్ని అర్హతలు ఉన్నా అమ్మఒడి రాలేదా, ఇలా చేయండి సర్కారు మరో అవకాశం

మీకు అన్ని అర్హతలు ఉన్నా అమ్మఒడి రాలేదా, ఇలా చేయండి సర్కారు మరో అవకాశం

0
106

ఏపీలో అమ్మఒడి పథకం మొత్తానికి ప్రారంభం అయింది.. పిల్లలకు ఆర్థికంగా అండగానే ఉండేందుకు జగనన్న అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చారు.. ఈ పథకం కింద 42, లక్షల మంది తల్లులకు, 81, లక్షల పిల్లలకు మేలు చేకూరింది. కచ్చితంగా స్కూల్లో 75 శాతం హజరు విధ్యార్దికి ఉండాలి అనే కండిషన్ పెట్టారు. అయితే చాలా మందికి ఇంకా తల్లుల అకౌంట్లో డబ్బులు జమ అవ్వలేదు అని కంగారు పడుతున్నారు.

కాని దీనిపై తాజాగా ప్రభుత్వం కీలక విషయం చెప్పింది.. రోజుకి నాలుగు లక్షల మందికి నగదు జమ చేస్తున్నారు.. అందుకే కాస్త ఆలస్యం అవుతోందని ఇందులో కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెబుతున్నారు విద్యాశాఖ అధికారులు. మొత్తానికి 21 వ తేదికి అందరికి నగదు డిపాజిట్ అవుతుంది అని చెప్పారు.

ఒక వేళ 21 వ తేదిన మీకు నగదు డిపాజిట్ కాకపోతే, ఫ్రిబ్రవరి 9 లోపు మరోసారి అన్నీ అర్హతలు ఉన్న వారు అప్లై చేసుకోవాలి అని చెప్పారు.
దీని తర్వాత రెండో విడతలో నగదు డిపాజిట్ కాని వారికి నగదు చెల్లిస్తారు.. అంతేకాదు ఎలిజబుల్ లిస్ట్ లో ఉన్నవారికి రెండో విడతలో నగదు జమ అవుతుంది అని తెలిపారు.

ఒక వేళ పేమెంట్ రిజెక్టక్ అని మెసేజ్ వస్తే మీకు అర్హత లేదు అని చెబుతున్నారు అధికారులు.. ఇక మీ డాక్యుమెంట్లు సరిగ్గా సబ్ మీట్ చేయకపోతే, కచ్చితంగా కొత్త అప్లికేషన్ గ్రామ సచివాలయాల్లో ఇస్తున్నారు దానిలో అప్లై చేస్తే మీకు ఫ్రిబ్రవరి 9 న అమౌంట్ క్రెడిట్ అవుతుంది. గ్రామ వాలంటీర్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఫ్రిబ్రవరి 9 చివరి తేదిగా సర్కారు మరో అవకాశం ఇచ్చింది.