విపక్షాలపై మంత్రి కేటీఆర్(KTR) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. తెలంగాణ కన్నా ఉత్తమ పాలన ఏ రాష్ట్రంలో ఉందో చెప్పాలని చాలెంజ్ చేశారు. తెలంగాణ కన్నా మెరుగైన మోడల్ రాష్ట్రాన్ని చూపించాలి అని కేటీఆర్(KTR) డిమాండ్ చేశారు. 75 ఏండ్లు పాలించిన బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) పార్టీలు ప్రజలకు ఏం చేశాయి. మేం 9 ఏండ్లలో అభివృద్ధిలో అద్భుతాలు చేసి చూపించాం. బీజేపీ, కాంగ్రెస్ పరిపాలన కొత్త సీసాలో పాత సారా మాదిరి. కేంద్ర మంత్రులు టాయిలెట్స్, రైల్వేస్టేషన్లలో లిప్ట్‌లు ఓపెన్ చేస్తున్నారు. మేం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టులు కడుతున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ గత 10 ఏండ్లుగా నీళ్లు, నిధులు, నియామకాలన్న స్ఫూర్తికి అనుగుణంగా పని చేస్తోంది అని కేటీఆర్ తెలిపారు. అందులో తెలంగాణ విజయం సాధించింది.