మంత్రి రేసులో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు… సీఎం జగన్ ఎవరిని ఫైనల్ చేస్తారు…?

మంత్రి రేసులో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు... సీఎం జగన్ ఎవరిని ఫైనల్ చేస్తారు...?

0
93

రాష్ట్రంలో ఇద్దరు కేబినెట్ మంత్రులైన పిల్లి సుభాష్, మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభకు ఎంపికైన నేపథ్యంలో వారి స్థానాల్లో కొత్తవారి ఎంపిక కోసం జోరుగా కసరత్తు జరుగుతోంది.. రాజ్యసభకు వెళ్లిన వారిద్దరూ బీసీ మంత్రులు కావడం సీఎంకు వీరి విధేయులు కావడంతో వారి స్థానంలో వచ్చే వారు కూడా అదే సామాజిక వర్గం వారే ఉండాలని కొందరు భావిస్తున్నారు.. బీసీలకు ఒకేసారి రెండు రాజ్యసభ సీట్లు ఇచ్చినందున మిగిలిన సామాజిక వర్గాలను కూడా చోటివ్వాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి…

ఇదే సమయంలో తొలి కేబినెట్ లోచోటు దక్కని ఆశావాహులు కూడా తమను పరిగణలోకి తీసుకోవాలని సీఎం జగన్ కు విన్నపాలు పంపుతున్నారట… సామాజిక సమీకరణాలే కీలకమయ్యే ఏపీలో కేబినెట్ విస్తరణ ఏ ముఖ్యమంత్రి కైనా కత్తిమీద సామే అవుతోంది… మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మోపిదేవి రాజ్యసభకు ఎంపిక కావడంతో వారి స్థానాల్లో కేబినెట్ బెర్తులు దక్కించుకునేది ఎవరన్న ఉత్కంఠ పెరుగుతోంది… త్వరలో వీరిద్దరు రాజీనామాలకు ప్రకటించేందుకు సిద్దమవుతుండగా వీరి స్థానాల్లో ఎవరిని భర్తీ చేయాలనే విషయంలో సీఎం జగన్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం…

ప్రస్తుతం మంత్రులుగా ఉంటూ రాజ్యసభకు ఎన్నికైన ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే ఇందులో పిల్లి శెట్టి బలిజ కాగా మోపిదేవి మత్సకార వర్గానికిచెందిన వారు… దీంతో వీరి స్థానాల్లో మరో ఇద్దరు బీసీలకే చోటు కల్పించాలనే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది… కాబట్టి బీసీల్లో గౌడ సామాజిక వర్గానికి చెందిన కృష్ణా జిల్లాకు పెడన ఎమ్మెల్యే జోగిరమేష్ మత్సకార సామాజిక వర్గానికి చెందిన పొన్నాడ సతీష్ కుమార్ లకు అవకాశం దక్కేల కనిపిస్తోంది… వీరితోపాటు పార్థ సారధి పేరుకూడా వినిపిస్తుంది… మరి సీఎం జగన్ ఎవరిని తన కేబినెట్ లో తీసుకుంటారో చూడాలి…..