అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుపై వంశీ సంచలన కామెంట్స్

అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుపై వంశీ సంచలన కామెంట్స్

0
86

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగుతున్నాయి… ఈ సమావేశంలో గన్నవరం ఎమ్మెల్యే వంశీ చంద్రబాబు నాయుడు పై అలాగే టీడీపీ ఎమ్మెల్యేలపై సంచలన వ్యాఖ్యాలు చేశారు…. అసెంబ్లీలో వంశీ ప్రసంగిస్తుండగా టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డారు…

వంశీ మాట్లాడటానికి వీళ్లేదని అన్నారు… ఎమ్మెల్యే కొనసాగేందుకు వంశీ అనర్హుడని అన్నారు…. ఇక దీనిపై ఘాటుగా స్పందించిన వంశీ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు…. తాను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసినందుకు తన్ను సస్పెండ్ చేశారని అన్నారు…

గతంలో అనేక సందర్భంల్లో తాను జగన్ ను కలిశానని అన్నారు… తనపై కుట్రపూరితంగా టీడీపీ తనను సస్పెండ్ చేసిందని ఆరోపించారు…. ఏపీలో జగన్ సర్కార్ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని అన్నారు వంశీ….