మోదీ ఆ పని చేస్తే బీజేపీలో చేరుతా జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు

మోదీ ఆ పని చేస్తే బీజేపీలో చేరుతా జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు

0
96

తెలుగుదేశం పార్టీ నాయకుడు సీనియర్ లీడర్ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రాజకీయంగా అడుగులు మారుతున్నాయి అని వార్తలు వినిపిస్తున్నాయి, తనని వైసీపీ టార్గెట్ చేసింది అని భావిస్తున్న జేసి తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరాలి అని భావిస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సమయంలో జేసీ దివాకర్ రెడ్డి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. … ఇక ఆయన బీజేపీలో చేరిపోతారు అని అందరూ చర్చించుకున్నారు.
అనంతపురం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో సత్యకుమార్ ను జేసీ కలిసి మాట్లాడారు. అయితే దీనిపై నేరుగా జేసీ క్లారిటీ ఇచ్చారు.

సత్యకుమార్ మిత్రుడు కావడంతోనే కలిశానని వెల్లడించారు. బీజేపీ నేతలతో సమావేశానికి పెద్దగా ప్రాధాన్యం లేదని అన్నారు. పార్టీ మారే ఆలోచన లేదని, ప్రాంతీయ పార్టీలు ఉన్నంతవరకు టీడీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. పీవోకేను భారత్ ఆక్రమిస్తే బీజేపీలో చేరతానని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. మొత్తానికి మోదీ ఆ పని ఆరునెలల్లో చేస్తే జేసీ కచ్చితంగా బీజేపీలో చేరినా ఆశ్చర్యపోవక్కర్లేదు.