ప్రధాని మోదీ బ్యూటీ టిప్…

ప్రధాని మోదీ బ్యూటీ టిప్...

0
81

తన చర్మం ఎప్పుడూ ప్రకాశవంతంగా కనిపించడానికి గల రహస్యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయటపెట్టారు. ప్రధానమంత్రి బాల పురస్కారం పొందిన 49 మంది విద్యార్థులతో న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముచ్చటించారు. ఈ సందర్భంగా తన చర్మ సౌందర్య రహస్యాన్ని ఆయన బయటపెట్టారు. మీలో ఎవరైనా రోజుకు నాలుగుసార్లు చమటోడుస్తారా? అని ఆ పిల్లలను ప్రధాని ప్రశ్నించారు. వారు దానికి సమాధానం ఇచ్చారు. అనంతరం మాట్లాడిన నరేంద్ర మోదీ విద్యార్థులు ఎప్పుడూ శారీరకంగా ఉత్తేజంగా ఉండాలని, చమటోడ్చితే అందంగా కనిపిస్తారని తెలిపారు.

‘చాలా సంవత్సరాల క్రితం కొందరు నన్ను అడిగారు. నా ముఖం ఎందుకు అంత మెరిసిపోతుందని ప్రశ్నించారు. నా సమాధానం చాలా సింపుల్. నేను చాలా కష్టపడతాను. చాలా చమటోడుస్తాను. ఆ చెమటతో నా ముఖానికి మసాజ్ చేస్తాను. దీంతో నా ముఖం మెరుస్తూ ఉంటుంది.’ అని ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు చెప్పారు.