దేశంలో కోరానా పాజిటీకే కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది, ఈ సమయంలో కేంద్రం కూడా కీలక నిర్ణయం తీసుకుంది… ఉపాది పనులు ఉద్యోగాలు వ్యాపారాలు లేక చాలా మంది చేతిలో చిల్లిగవ్వలేక ఇబ్బంది పడేవారు ఉంటారు, వారి విషయంలో కేంద్రం చాలా సాయం చేయాలి అని చూస్తోంది.
ఇప్పటికే మూడు నెలల ఈఎంఐలపై మారిటోరియం విధించింది.. ఇందులో క్రెడిట్ కార్డులు కూడా ఉన్నాయి, మూడు నెలలు ఎలాంటి చెల్లింపులు చేయనవసరం లేదు.
ఇక కేంద్రం దాదాపు మూడు కోట్ల మంది వితంతువులు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు జాతీయ సామాజిక చేయూత పథకం కింద నెలవారీ పింఛన్లు పంపిణీ చేస్తోంది. వీరికి మూడు నెలల పించన్లు ఒకేసారి ఇవ్వాలి అని చూస్తోంది
ఏప్రిల్ నెలలోనే వీరి బ్యాంకు ఖాతాలలో మూడు నెలల పెన్షన్ ఒకేసారి జమ కానుంది. 60 – 79 ఏళ్ల లోపున్న వితంతువులు, దివ్యాంగులకు 300 రూపాయలు, 60 – 79 ఏళ్ల లోపున్న వృద్ధులకు 200 రూపాయలు పింఛన్ అందిస్తోంది. 80 ఏళ్లు పైబడిన దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు మాత్రం 500 రూపాయల చొప్పున పెన్షన్ అందుతోంది. వీరికి ఏప్రిల్ లో మొత్తం మూడు నెలల అమౌంట్ వేయనున్నారు.