మోదీ నివాసంలో అగ్ని ప్రమాదం

మోదీ నివాసంలో అగ్ని ప్రమాదం

0
87

మన దేశంలో ప్రధాని నరేంద్రమోదీ పై ఎంతో మందికి ఇష్టం ప్రేమ ఉంది.. ఆయన గొప్ప రాజకీయ వేత్త అని అందరూ చెబుతారు.. అయితే ఆయనకు చిన్న సమస్య వచ్చినా చాలా మంది తట్టుకోలేరు .. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ఆయన ప్రజలకు చాలా దగ్గరగా ఉంటారు.

అయితే తాజాగా ఆయన ఇంటిలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది అనే వార్త వినిపించింది.. దీంతో దేశ ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఏమైంది అని తెలుసుకునేందుకు నెట్ లో సెర్చ్ చేస్తున్నారు. అయితే పెను ప్రమాదం జరగలేదు అని తెలుస్తోంది.. ఆయన ఇంటిలో మంటలు వ్యాపించక ముందే అగ్నిమాపక సిబ్బంది వచ్చి వాటిని ఆర్పివేశారట.

ఢిల్లీలోని కల్యాణ్ మార్గ్ లో ఉన్న ప్రధాని మోదీ అధికారిక నివాసంలో సాయంత్రం 7.25 గంటలకు ఈ ప్రమాదం జరిగింది అని అధికారులు తెలిపారు. 9 అగ్ని మాపక వాహనాలతో అక్కడికి సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటన చేసింది. . ఎస్పీజీ రిసెప్షన్ లో ఈ ప్రమాదం జరిగిందని ట్విట్టర్ మాద్యమంగా వెల్లడించింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.