మోహన్ బాబుకు జగన్ బంపర్ ఆఫర్

మోహన్ బాబుకు జగన్ బంపర్ ఆఫర్

0
89

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన విలక్షణ నటుడు మంచు మోహన్ బాబుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక పదవి కట్టబెట్టాలని డిసైడ్ అయ్యారట… వచ్చే సంవత్సరం రాజ్యసభ ఎంపీ ఖాళీ అవ్వనుండటంతో ఆ పదవికి మోహన్ బాబును నామినేటెడ్ చేయాలని అనుకుంటున్నారట…

ఈ మేరకు చర్చలు కూడా నడుస్తున్నాయట… ఇప్పటికే ఎస్వీబీసీచైర్మన్ గా పృథ్వీ తాజాగా తెలుగు అకాడమి చైర్మన్ గా లక్ష్మీపార్వతిలకు పదవులను అప్పగించిన సంగతి తెలిసిందే…

ఎన్టీఆర్ హయాంలో రాజ్యసభ సభ్యునిగా పనిచేసిన అనుభవం ఉంది మోహన్ బాబుకు… అందుకే ఆయనకు అదే పదవిని కట్టబెట్టాలని జగన్ ఆలో చిస్తున్నారట… ఒక వేళ ఆయన కు ఈ పదవిని జగన్ కట్టబెడితే మోహన్ బాబు పూర్తిగా హస్తినకు పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు…