ఎంపీ విజయసాయిరెడ్డిపై భూ ఆరోపణలు -సాక్ష్యాలు చూపిస్తున్నవ్యక్తి

ఎంపీ విజయసాయిరెడ్డిపై భూ ఆరోపణలు -సాక్ష్యాలు చూపిస్తున్నవ్యక్తి

0
74

విశాఖలో వైసీపీ భూ కుంభకోణానికి తెరలు తీస్తోంది అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు… కావాలనే రాజధాని అక్కడ సెలక్ట్ చేసి భూదందా చేస్తున్నారు అని విమర్శలు చేస్తున్నారు.. అందుకే వైసిపి సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి విశాఖపట్టణం ఇంచార్జిగా వ్యవహరిస్తూ రాజకీయాలు చేస్తూనే ఇక్కడ భూములపై కన్నేశారు అని విమర్శిస్తున్నారు టీడీపీ నేతలు.

అయితే తాజాగా విజయసాయిరెడ్డి విశాఖ పట్టణంలో భారీ భూదోపిడీ చేసినట్లు..పట్టాభి అనే వ్యక్తి ఆరోపించారు. ప్రభుత్వ జీవోలు పాస్ చేస్తూ విశాఖపట్టణం లో భారీ ఎత్తున కొన్ని వేల ఎకరాలు విజయసాయిరెడ్డి భారీ భూదోపిడీ చేశారని పేర్కొన్నారు. జీవోనెం-72 ద్వారా విశాఖపట్టణంలో 2,400ఎకరాల స్కామ్ జరిగిందని, అందుకు మూలకారకుడు విజయసాయిరెడ్డేనని, జీవోనెం-72లో ప్రత్యేకంగా విశాఖనగరాన్నే ఎందుకు చేర్చారని ప్రశ్నించారు.

ఇలా భూ దోపిడి చేస్తున్నారు అని పెద్ద ఎత్తున విమర్శించారు, దీనిపై వైసీపీ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు.. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరుగుతున్న వేళ కావాలనే వైసీపీ నాయకుడు ఎంపీ విజయసాయిరెడ్డి పై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అని విమర్శించారు ఆయన.