కేబినెట్ సమావేశం ముగిసింది… ఈ సమావేశంలో రాజధాని అంశంలో జీఎన్ రావు కమిటి నివేదికపై పూర్తి స్థాయిలో చర్చించారు… అలాగే స్థానికి సంస్ధల ఎన్నికలపై కూడా సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది… ఈ సంధర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విశాఖలో సచివాలయ ఏర్పాటుపై మంత్రుల అభిప్రాయం తీసుకున్నారు…
అయితే ఎక్కువ మంది సచివాలయాన్ని విశాఖకు తరలించడమే బెటర్ అని చెప్పినట్లు తెలుస్తోంది… అంతేకాదు ఈ నిర్ణయంపై అఖిల పక్షం ఏర్పాటుపై కూడా జగన్ మంత్రులతో చర్చించారు… అలాగే తెలుగుదేశం పార్టీ హయంలో జరిగి అవినీతి అక్రమాల నివేదికను కేబినెట్ కు సమర్పించింది మంత్రివర్గ ఉప సంఘం…
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆద్వర్యంలో ఏర్పాటు అయిన మంత్రి వర్గం ఉప సంఘం నాలుగు నెలల పాటు చంద్రబాబు హయాంలోనే ప్రాజెక్టులు, నిర్మాణలపై అధ్యాయనం చేసింది…