ఎన్నికల్లో వైసీపీ నేతలకు కొత్త టెన్షన్

ఎన్నికల్లో వైసీపీ నేతలకు కొత్త టెన్షన్

0
102

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ వీడియోలు చూసి పాల్ రావాలి పాలన మారాలి అని చెబుతున్న మాటలు విని పాల్ ఏమీ చేయలేడు అని అనుకున్నారు …చివరకు పాల్ చేసిన పనికి వైసీపీకి పెద్ద మైనస్ అయ్యేలా ఉంది. ముఖ్యంగా నామినేషన్లు వేసిన వారిలో 35 మంది వైసీపీ తరపున ఎవరు అయితే నిలుచున్నారో ,వారి పేర్లను పోలిన వారిని తీసుకువచ్చి పాల్ నామినేషన్ వేయించారు. ఇందులో నాకు ఏ సంబంధం లేదు మరి ఇలా 35 మంది ఎలా పోటీ చేస్తున్నారు అంటే తెలియదు అంటున్నారు. వారి ఎంపిక ఎలా చేశారు అంటే, ఆయన ఎన్నికల కమిటీ ఇలా నిర్ణయం తీసుకుని వారికి టికెట్ ఇచ్చింది అని చెబుతున్నారు పాల్ …కాని వైసీపీకి ఇది ఓట్లు విషయంలో పెద్ద ఇబ్బంది వస్తుంది అని తెలుస్తోంది.

ఈసీకి కంప్లైంట్ ఇచ్చినా గుర్తు కూడా ఒకేలా ఉండటం ఈవీఎమ్ లో ఓట్లకు గండికొట్టేలా మారుతుంది అంటున్నారు విశ్లేషకులు. రాజకీయంగా ఇది కక్ష సాధింపు చర్య అని వైసీపీ విమర్శిస్తుంటే పాల్ తెలివి తేటలు అని ఆయన అభిమానులు అంటున్నారు, మొత్తానికి ఈ పోటీలో ఈ 35 మంది అభ్యర్దులు వైసీపీ తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్నా టెన్షన్ లోనే ఉన్నారట.