ఎన్నికల వేళ బాబుకు కొత్త టెన్షన్

ఎన్నికల వేళ బాబుకు కొత్త టెన్షన్

0
31

ఓపక్క కేంద్రంలో రాహుల్ గాంధీకి సపోర్ట్ చేస్తూ ఏపీలో తమకు ప్రత్యేక హోదా రాహుల్ ఇస్తాము అని అన్నారు అని చెబుతున్న చంద్రబాబు, ఆనాడు ప్రత్యేక హోదాకి చట్టబద్దత ఎందుకు తీసుకురాలేదు అనే విషయంలో వారిని గట్టిగా నిలదీయలేకపోతున్నారు ..బీజేపీని కాంగ్రెస్ తో కలిపి నిలదీయలేక చంద్రబాబు కాంగ్రెస్ తో ఇప్పుడు చేతులు కలిపారు అని, అటుకేంద్రంలో కాంగ్రెస్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు వేస్తున్న కుట్రలు అని వైసీపీ విమర్శలు చేస్తోంది.

ఓ పక్క ప్రత్యేక హోదా కోసం కేసులు పెట్టి ఆ పోరాటాలు చేసిన వారిని అరెస్ట్ చేయించిన చంద్రబాబు ఇప్పుడు ఎలా ప్రత్యేక హోదా కావాలి అని అడుగుతున్నారు, రాజకీయం కోసం బాబు మాటలు మారుస్తున్నారు అని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు.

కేంద్రంలో మోదీకి వ్యతిరేకత ఉంది ఇది కచ్చితంగా కాంగ్రెస్ కు ప్లస్ అవుతుంది అని అనుకున్న బాబు, మోదీకి బాయ్ చెప్పి రాహుల్ తో కలిశారు. కాంగ్రెస్ తో ముందుకు వెళుతున్నారు. ఇప్పుడు దేశంలో పొలిటికల్ వేవ్స్ చూస్తుంటే మరోసారి ప్రధానిగా మోదీ అయ్యే అవకాశం ఉంది అని తెలుస్తోంది. అంతేకాదు కేంద్రంలో చక్రాలు తిప్పుతానంటున్న బాబు ఏపీలో ఎన్ని ఎంపీ స్దానాలు గెలుస్తారు అంటే కేవలం 3 స్ధానాలు అని సర్వేలు చెబుతున్నాయి.. అన్ని సర్వేలు ఇలాంటి ఫలితాలు చెప్పంతో బాబు ఇటీవల షాక్ లో ఉన్నారని టీడీపీ నేతలే చర్చించుకుంటున్నారు.