ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న వేళ నూతన సంవత్సర వేడుకలపై కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించింది. డిసెంబరు 30 నుంచి జనవరి 2 వరకు బహిరంగంగా జరిగే వేడుకలను నిషేధించింది.
అపార్ట్‌మెంట్‌లలో డీజేల వినియోగంపై కూడా నిషేధం విధించింది. అంతర్గత ప్రదేశాల్లో 50శాతం సామర్థ్యంతో వేడుకలకు అనుమతినిచ్చింది. భౌతికదూరం తప్పనిసరిగా పాటిస్తూ పబ్బులు, రెస్టారెంట్లలో వేడుకల్లో పాల్గొనేందుకు అనుమతిచ్చింది. వ్యాక్సిన్ వేసుకోనివారు పబ్బులు, రెస్టారెంట్లలో వేడుకల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 19 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
అత్యధికంగా మహారాష్ట్రలో 54, దిల్లీలో 54 కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత తెలంగాణలో 24, కర్ణాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్‌లో 14 కేసులు వెలుగుచూసినట్లు తెలిపింది. ఒడిశాలో కూడా రెండు ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి.