రైతుల కోసం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే వాటిలో పీఎం కిసాన్ స్కీమ్ కూడా ఒకటి. పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులను రైతులకు అందించేందుకు మోదీ సర్కార్ సిద్ధం అవుతోంది. ఇది రైతులకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కొత్త సంవత్సరం రోజున రైతుల ఖాతాల్లోకి ఆ డబ్బులు చేరనున్నట్టు తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం కొత్త ఏడాది అంటే జనవరి 1న రైతుల బ్యాంక్ ఖాతాల్లో పదవ విడత డబ్బుల కింద రూ.2 వేలు జమ చేయనుందని తెలుస్తోంది. అలానే కేంద్రం పీఎం కిసాన్ రైతులకు మెసేజ్ పంపినట్లు తెలుస్తోంది. అదే విధంగా ప్రధాని మోదీ కొత్త ఏడాది రోజున రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడొచ్చని తెలుస్తోంది.
ప్రతి ఏటా పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకు రూ.6 వేలు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇవి ఒకేసారి రావు. విడతల వారీగా వస్తాయి. మూడు విడతల్లో రూ.2 వేలు చొప్పున రైతులకు డబ్బులు అందుతున్నాయి. పదో విడత డబ్బులు వస్తే రైతులకు రూ.20 వేలు అందినట్లు అవుతుంది.
ఇక డబ్బులు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి..
మీరు ముందుగా పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
అక్కడ ఫార్మర్స్ కార్నర్ మీద క్లిక్ చెయ్యాలి.
ఇక్కడ బెనిఫీషియరీ స్టేటస్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
ఇప్పుడు మీ ఇన్‌స్టాల్‌మెంట్ స్టేటస్ చూడచ్చు.