తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ఎవరెవరు గెలుపు గుర్రాలు అని పలు సర్వేల ద్వారా వడపోసి సీట్లు టిక్కెట్లు ఇచ్చినా, కొందరి గెలుపు పోలింగ్ తర్వాత కష్టం అని తెలుస్తోంది. ముఖ్యంగా కీలక నాయకులు మంత్రులు సెగ్మెంట్లలో నెగిటీవ్ వేవ్స్ రావడంతో కొందరు ఈసారి ఓటమి చెందుతారు అన చెబుతున్నారు.. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో బాలకృష్ణ హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.. ఆయన గెలుపు కోసం ఎంతో శ్రమించారు ఈ సారి ఎన్నికల్లో.. అంతేకాదు ప్రచారంలో అసహనంతో అభిమానిపై తిట్ల పురాణం వదిలారు.. ఇలా 50 వేల మెజార్టీ సార్ అని అంటే ఎవడ్రా నువ్వు ఇక్కడ గెలవడం డిపాజిట్ కష్టంగా ఉండే 50 వేలు అంట అని ఫైర్ అయ్యారు బాలయ్య.
ఇక ఇటీవల అమరావతిలో చంద్రబాబు పార్టీ నేతలతో మీటింగ్ అయింది..ఇక బాలయ్య సెగ్మెంట్ లపై రిపోర్ట్ కూడా అందింది. బాలయ్య పోలింగ్ ముగిసిన రెండోరోజే అక్కడ ఎంత మేర పోలింగ్ అయింది. పోల్ అయిన ఓట్లు ఎన్ని, ఇక ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఇలా లిస్ట్ రెడీ చేసుకుని వెళ్లారు. అయితే ఇప్పుడు మరోసారి అక్కడ నేతలతో భేటీ అయ్యారు బాలయ్య. హిందూపురంలో రెండు రోజుల పాటు అక్కడ నేతలతో సమాలోచనలు చేయనున్నారు. ఇటు వైసీపీ తరపున మరో వ్యక్తిని తీసుకువచ్చి పోటీ చేయించడం తెలుగుదేశం పార్టీకి లాభిస్తుంది అని అనుకున్నారు. కాని ఇది రివర్స్ అవుతుంది అని ఇక్కడ నేతల సర్వే రిపోర్టుల్లో తేలిందట.