జగన్ కు వైసీపీకి ఈ విషయంలో గట్టి నమ్మకం ఉందట

జగన్ కు వైసీపీకి ఈ విషయంలో గట్టి నమ్మకం ఉందట

0
56

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అన్నీ సర్వేలు పాజిటీవ్ గా చెబుతున్నాయి.. జగన్ సీఎం కాబోతున్నారు అంటూ సర్వేలు అన్నీ చెబుతుంటే, ఎల్లో మీడియాలు కొన్ని బాబు అనుకూల మీడియాలు మాత్రం టీడీపీకి 140 స్దానాలు వస్తాయి అని చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీని ఈ మీడియాలు జాకీలు పెట్టి లేపుతున్నాయి. ఇటీవల కొందరు మీడియా హెడ్స్ బాబుకు అనుకూలమైన రిపోర్టుని విడుదల చేసి మూడు చానల్స్ లోప్రచారం చేశారు. ఏపీకి బాబు సీఎం కాబోతున్నారు అంటు చెబుతున్నాయి ఈ మీడియాలు.

అయితే ఇప్పుడు కొత్త వార్త కూడా వినిపిస్తోంది ఒకవేళ జనసేనకు మెజార్టీ సీట్లు వస్తే కచ్చితంగా జగన్ కు లేదా బాబుకు మద్దతు అవసరం ఏర్పడితే, పవన్ కల్యాణ్ తప్పకుండా చంద్రబాబుకి మాత్రమే మద్దతు ఇస్తారట. దీనికి కారణం గతంలో మిత్రులుగా ఇద్దరూ కలిసి పనిచేయడం కారణం అని చెబుతున్నారు. ఇప్పటికే ఇద్దరి మధ్య ఒప్పందం కూడా కొందరి మధ్య జరిగింది అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి, అయితే అసలు సింగిల్ డిజిట్ కు మాత్రమే పరిమితం అయ్యే జనసేన బాబుకు ఏం మద్దతు ఇస్తుంది అని వైసీపీ విమర్శిస్తోంది.