వర్మ కోసం జగన్ ట్వీట్ వైసీపీ దూకుడు

వర్మ కోసం జగన్ ట్వీట్ వైసీపీ దూకుడు

0
31

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వివాదాలతోనే తెలుగుదేశం నేతల విమర్శలతోనే తెలంగాణలో విడుదల అయింది.. ఏపీలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటం ఎన్నికల సమయం కావడంతో ఈ సినిమా విడుదల కాకుండా కోర్టుకు కూడా వెళ్లారు టీడీపీ నేతలు. ఇక ఈ సినిమాపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.. మొత్తానికి ఎన్నికల సమయంలో ఈ సినిమా విడుదల కాకుండా చేశారు. ఇక ఎన్నికలు ముగిశాయి ఫలితాలు మాత్రమే ఇక రానున్నాయి. ఈ సమయంలో వర్మ ఈ సినిమాని ఏపీలో విడుదల చేసేందుకు సిద్దమయ్యారు. విజయవాడలోని ఈ సినిమాకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టాలి అని ప్రయత్నించారు. కాని అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. పైపులరోడ్డు జంక్షన్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగంగా విలేకరుల సమావేశం నిర్వహిస్తానని వర్మ తెలిపారు. ఇక విజయవాడలో శాంతి భద్రతల అంశంలో పోలీసులు వర్మని అడ్డుకున్నారు. దీనిపై తాజాగా వైసీపీ
అధినేత జగన్ ఓ ట్వీట్ సంధించారు.

విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టలేని పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. పోలీసుల్ని బంట్రోతులు కన్నా హీనంగా వాడుకునే పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. ఇదా ప్రజాస్వామ్యం..! చంద్రబాబు గారూ..! ఇంతకీ రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటి..?’’ అంటూ జగన్ ట్వీట్ చేశారు.