వైసీపీ నేతలను మీడియా ముఖంగా పెద్ద ఎత్తున ప్రశ్నించడంలో ఎమ్మెల్సీ బుద్దావెంకన్న ముందు ఉంటుంటారు.. ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన పెద్ద ఎత్తున జగన్ పై వైసీపీ నేతలను టార్గెట్ చేశారు.. ఇక ఇప్పుడు వైసీపీ టీడీపీ నేతలు ఎన్నికల తర్వాత కూడా పోలింగ్ ముగిసినా విమర్శలు మాత్రం ఆపుకోవడం లేదు. ఎన్నికల వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది.. ఇదంతా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా వార్ గా మారంది. మరో పక్క విజయసాయిరెడ్డి టీడీపీ నేతలపై ట్విట్టర్లో విమర్శల జోరు పెంచారు.. మంత్రులపై లోకేష్ పై బాబుపై విమర్శలు చేస్తున్నారు తాజాగా బుద్దావెంకన్న జగన్ పై విజయసాయిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
విజయసాయిరెడ్డి వల్ల జగన్కు నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని జగన్కు సలహా ఇచ్చారు..గత ఎన్నికల్లో కూడా ఇలాగే హడావుడి చేశారు సర్వేలతో , ఇప్పుడు కూడా జగన్ కు సర్వేల అధికారం తప్ప నిజమైన అధికారం రాదు అని విమర్శించారు. అంతే కాకుండా తిరుపతిలో ఉన్న వెంకటేశ్వరస్వామి వారి వస్తువుల పై విజయసాయిరెడ్డి కన్నుపడిందని, అందుకే శ్రీవారి వస్తువులు చేజారిపోయాయని గగ్గోలు పెడుతున్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు. ఇక జైలు జీవితంలో సహకరించాడని విజయసాయిరెడ్డికి జగన్ రాజ్యసభ సీటు ఇచ్చారని… ఆయన విజయసాయిరెడ్డి కాదని.. జైలు సాయిరెడ్డిగా మారిపోయారని వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు