పరిటాల సునీత సంచలన నిర్ణయం

పరిటాల సునీత సంచలన నిర్ణయం

0
115

ఏపీలో ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో నాయకులు కొందరు టిక్కెట్ల కోసం పార్టీల అధినేత దగ్గర క్యూ కడుతున్నారు.. తమకు ఈసారి అవకాశం ఇవ్వాలి అని సిట్టింగులు, అలాగే పార్టీకోసం కష్టపడ్డాం మాకు ఛాన్స్ ఇవ్వాలి అని మాజీలు అర్జీలు పెట్టుకుంటున్నారు. అయితే ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు, ఈసారి రాజకీయంగా వారసులకు తల్లి దండ్రులకు ఒకే కుటుంబంలో రెండు సీట్లు ఇచ్చేందుకు సుముఖత చూపించడం లేదు అని తెలుస్తోంది.. ఈసారి వారసులకు సీటు లేదు అని చెబుతున్నారు.. కేవలం ఒకరికి మాత్రమే టికెట్ అని చెప్పారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఇదే విషయం చర్చకు వస్తోంది.

అనంతపురం జిల్లా టీడీపీ మంత్రి సునీత వచ్చే ఎన్నికల్లో తనయుడు పరిటాల శ్రీరామ్ను ఎన్నికల బరిలోకి దించాలని అనుకున్నారు.. కాని కేవలం రాప్తాడు నుంచి పరిటాల సునీతకు మాత్రమే బాబు టికెట్ కేటాయించారు. ఇక పరిటాల శ్రీరామ్ కు ఎమ్మెల్యే టికెట్ లేదా హిందూపురం ఎంపీ టికెట్ ఇస్తారు అని అనుకున్నారు, కాని చంద్రబాబు అవకాశం ఇవ్వకపోవడంతో ఆమె పోటి నుంచి విరమించుకున్నారాట. తన బదులు రాప్తాడు నుంచి తన కుమారుడు పరిటాల శ్రీరామ్ పోటీలో ఉంటారు అని ప్రచారం కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఇదే విషయం చంద్రబాబుకు తెలియచేశారట. తొలిజాబితాలో పరిటాల శ్రీరామ్ పేరు రాప్తాడు నుంచి ఉంటుంది అని చెబుతున్నాయి పార్టీ వర్గాలు.