బీజేపీ సభకు పవన్ కల్యాణ్ ఎప్పుడు ఎక్కడ ఇవే వివరాలు

బీజేపీ సభకు పవన్ కల్యాణ్ ఎప్పుడు ఎక్కడ ఇవే వివరాలు

0
82

తెలంగాణలో బీజేపీ తన సత్తా చాటాలి అని సిద్దం అవుతోంది… ఇప్పటికే ఎంపీ సీట్లు గెలవడంతో అక్కడ జోరు మీద ఉన్న బీజేపీ… ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి మరింత బలోపేతం అవ్వాలి అని ప్లాన్ లో ఉంది… జాతీయ పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ కు మద్దతుగా హైదరాబాద్ లో బీజేపీ బహిరంగ సభ నిర్వహించనుంది. అయితే ఈ సభ వచ్చే నెలలో జరుగనుంది.

వచ్చే నెల 14న జరిగే ఈ సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రానున్నారు, అంతేకాదు ఏపీలో బీజేపీ మిత్ర పక్షంగా ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హజరుకానున్నారు. ఈ సమావేశానికి మరికొందరు కేంద్రంలోని పెద్దలు కూడా హజరుకానున్నారు.

హైదరాబాద్ లోని. ఎల్బీ స్టేడియం వేదికగా నిర్వహించే ఈ సభలో అమిత్ షా, పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు. మొత్తానికి ఇటీవల బీజేపీతో కలిసిన తర్వాత పవన్ కల్యాణ్ తొలిసారిగా ఈ సభకు రానున్నారు.