పవన్ కు బిగ్ షాక్… సీఎం జగన్ తో చిరంజీవి మరోసారి భేటీ… అందుకోసమేనా…

పవన్ కు బిగ్ షాక్... సీఎం జగన్ తో చిరంజీవి మరోసారి భేటీ... అందుకోసమేనా...

0
142

ఏపీలో మరో బిగ్ భేటీకి వేదిక కానుంది… కరోనా నేతృత్వంలో ఏపీ వ్యవస్థ కుదేలైన నేపథ్యంలో ఇక దాన్ని గాడీలో పెట్టేందుకు సర్కార్ కార్యచరణ చేస్తోంది… ఈ క్రమంలోనే చాలా మంది ప్రముఖులతో పారిశ్రామిక వేత్తలతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భేటీ కావాలని భావిస్తున్నాట్లు వార్తలు వస్తున్నాయి… ఈ క్రమంలోనే మరోసారి జగన్ మోహన్ రెడ్డి అలాగే మెగా స్టార్ చిరంజీవి భేటీ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి…

కరోనా వైరస్ ఒక్కసారిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అతలా కుతలం చేసింది… దీంతో ఆర్థిక కర్యాకలాపాలు లేక రెవిన్యూ రాక రాష్ట్ర ప్రభుత్వం చాలా నష్టపోయింది… లాక్ డౌన్ పొడిగిస్తూనే చాలావరకు సడలింపులు చేసింది… ఇదే సమయంలో కేంద్రం చేసిన మార్గ దర్శకాలను పాటిస్తూ సినిమా షూటింగ్ లకు కూడా జగన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చే యోచనచేస్తున్నట్లు సమాచారం… చిత్ర పరిశ్రమకు ఏపీ సర్కార్ పెద్ద పీట వేస్తుందని జగన్ హామీ ఇచ్చారు…

గతంలో చిరు జగన్ తోభేటీ అయ్యారు… వైసీపీ రాస్యసభ ఆఫర్ చేసిందని అందుకే సీఎం జగన్ ను చిరంజీవి కలిశారని వార్తలు వచ్చాయి… అయితే దీనిపై చిరు క్లారిటీ ఇచ్చారు తాను కేవలం సినిమా ఇండస్ట్రీ పై చర్చించేందుకు మాత్రమే కలిశానని స్పష్టం చేశారు… ఇక అసలు విషయానికి వస్తే సీఎం జగన్ తో చిరు మరోసారి భేటీ కానున్నాట్లు వార్తలు వస్తున్నాయి… ఈ సారి చిరుతో పాటు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు భేటీ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి… ఈ సందర్భంగా ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలను చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది…