ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు… ప్రస్తుతం రాష్ట్రంలో ఎవరు చనిపోయినా వారు ఇసుక వల్లే చనిపోయారని టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు..
తాజాగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్షాలు ఇసుక రాజకీయాలు చేస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు… భారీ వర్షాల కారణంగా ఏపీలో ఇసుక కొరత ఏర్పడిందని అన్నారు.. దీనిని టీడీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని అన్నారు…
అలాగే పవన్ పై కూడా ఆయన వ్యాఖ్యానించారు… పవన్ ,చంద్రబాబు నాయుడు కు వత్తాసు పలుకుతున్నారని మండపడ్డారు… చంద్రబాబు నాయుడు అవినీతిని వెలకి తీస్తే 16 సంవత్సరాలు జైల్లో ఉంటారని పెద్ది రెడ్డి అన్నారు… అదే జరిగితే ఆయన్ను ఆ దేవుడే కాపాడాలని అన్నారు…