పవన్ ని విమర్శించిన ఆ ప్రబుద్ధులు ఎక్కడ ?

పవన్ ని విమర్శించిన ఆ ప్రబుద్ధులు ఎక్కడ ?

0
103

తెలంగాణ లో ఇప్పుడు ఒకటే వివాదం… ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థుల ఆత్మహత్య.. ఎన్నికల్లో ఘన విజయం సాధించి మళ్ళీ అధికారం దక్కించుకున్న కేసీఆర్ ఈ విషయం పై దృష్టి సారించక విమర్శల పాలవుతున్నారు.. 20 మంది విద్యార్థుల ఆత్మహత్యల తర్వాత కేసీఆర్ స్పందించడం ఇప్పుడు వివాదాస్పదమైంది.. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేయాలని నిన్న అయన అధికారులను ఆదేశించారు. పాసయిన విద్యార్థులు కూడా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోరుకుంటే గతంలో ఉన్న పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకుని చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ప్రక్రియను వీలయినంత త్వరగా ముగించి విద్యా సంవత్సరం కోల్పోకుండా అడ్వాన్సుడు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్, అడ్వాన్సుడు సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ప్రక్రియనంతా పర్యవేక్షించే బాధ్యతను విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్థన్ రెడ్డికి ముఖ్యమంత్రి అప్పగించారు.కాగా ఈ విషయంపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ‘తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థుల భవిష్యత్‌ను అగమ్యగోచరంగా మార్చడం దారుణం. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు. ఇంటర్ ఫలితాలు ప్రకటించాక 17మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరం. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి.. పరీక్ష ఫీజు చెల్లింపు, పేపర్ వాల్యుయేషన్ నుంచి ఫలితాల వెల్లడి వరకూ ప్రతి దశపైనా విద్యార్థుల్లోనూ.. వారి తల్లిదండ్రుల్లో అనేక సందేహాలు ఉన్నాయి’. ‘విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసి.. నిజాలు వెల్లడించాలి. సందేహాలు వ్యక్తం చేస్తున్న విద్యార్థులు.. వారి తల్లిదండ్రులపై ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఎదురుదాడి చేసే విధంగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నాం అన్నారు..

అయితే పవన్ తప్ప ఈ విషయంపై ఎవరు స్పందించకపోవడం తో కొన్ని అనుమానాలకు దారి తీస్తుంది.. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణాలో ఆంధ్రులపై దాడులు జరుగుతున్నాయని చెప్పినప్పుడు పృథ్విరాజ్, అలీ, చిన్ని కృష్ణ, మోహన్ బాబు , జీవిత రాజశేఖర్ లు అలాంటివేం జరగట్లేదు, కేవలం రాజకీయా లబ్ధికోసమే పవన్ ఇలా మాట్లాడుతూంరని ఆరోపించారు.. అంత ఒక్కటై పవన్ ని దుమ్మెత్తిపోశారు.. కాగా ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ విద్యార్థుల మరణాలపై ఎందుకు ఆ పైడ్ ఆర్టిస్టులు స్పందించట్లేదు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనసేన కార్యకర్తలు.. రాజకీయ లబ్ధికోసం పాకులాడే వ్యక్తి పవన్ కాదని, ఎవరైతే పవన్ విమర్శిస్తున్నారో వారే డబ్బుకోసం, హోదా కోసం ఇలా ఎప్పుడు లేనిది ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం పోరాడుతున్నామని మాటలు చెప్తున్నారని అంటున్నారు.