దేవినేని అవినాష్ కు గుడ్ న్యూస్

దేవినేని అవినాష్ కు గుడ్ న్యూస్

0
47

కొడాలి నానిపై ఈసారి కచ్చితంగా గెలుపు వస్తుంది అని భావించి దేవినేని వారసుడు అవినాష్ ని గుడివాడ బరిలోకి దించింది తెలుగుదేశం పార్టీ .అయితే అవినాష్ ముందు నుంచి ఇక్కడ దూకుడు చూపించి తెలుగుదేశం కేడర్ తో కలిసి పని చేశారు.. అలాగే ప్రచారంలో పెద్ద ఎత్తున తిరిగారు. అయితే మూడు మండలాల్లో వైసీపీకి బలమైన వేవ్స్ లేవు అనేది తేలిందట ప్రచారంలో, టీడీపీకి ఇక్కడ చాలా అనుకూలంగా పాజిటీవ్ వేవ్ ఉంది .

పైగా మార్పు కూడా ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. ఇక పెద్ద ఎత్తున మహిళలు కూడా ఓటు వేసిన సెగ్మెంట్ గా గుడివాడ నిలిచింది.. దీంతో ఇక్కడ ఈసారి టీడీపీకి బలమైన మెజార్టీ వస్తుంది అని చెబుతున్నాయి సర్వేలు.. అయితే 5 వేల మెజార్టీతో ఇక్కడ దేవినేని అవినాష్ గెలుపొందుతాడు అని సర్వేలు చెబుతున్నాయి. ఇప్పుడు ఇది కొడాలినాని కోటలో కొత్త గుబేలు కలిగిస్తోంది. ఇక కొడాలి నాని ఈసారి ఓటమి చెందితే తెలుగుదేశం పార్టీ ఇక్కడ పుంజుకుంటుంది… అంతేకాదు దేవినేని అనినాష్ కు ఇక ఇక్కడ సీటునే కేటాయిస్తారు అని చెబుతున్నారు టీడీపీ నేతలు. అందుకే బాబు ముందుగానే ఇక్కడ నుంచి దేవినేని వారసుడ్ని బరిలోకి దించారట.ఇక గుడివాడ సీటు దేవినేని అవినాష్ కు అని టీడీపీనేతలు చర్చించుకుంటున్నారు.