ప్రియుడితో శృతి హాసన్ బ్రేకప్.. కారణం అదే ..!!

ప్రియుడితో శృతి హాసన్ బ్రేకప్.. కారణం అదే ..!!

0
95

కొన్ని రోజులుగా అస‌లు శృతిహాస‌న్ ఒక్క సినిమా కూడా చేయ‌డం లేదు. తెలుగులో కాటమరాయుడు సినిమా తర్వాత :ఒక సినిమా చేయలేదు. రీసెంట్‌గా విజయ్ సేతుపతి సినిమాలో యాక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతకు ముందు దాదాపు రెండేళ్లు ఏ సినిమా చేయలేదు. ఇదిలా ఉంటే శృతి హాసన్ గత కొంత కాలంగా లండన్ కు చెందిన మైఖెల్ కోర్సెల్ అనే వ్యక్తితో ప్రేమాయణం సాగిస్తోంది. ఆ మధ్యన ప్రియుడిని తన తల్లిదండ్రులు కమల్ హాసన్, సారికకు పరిచయం కూడా చేసింది. దీనితో శృతి హాసన్, మైఖేల్ త్వరలో వివాహం చేసుకోవడం ఖాయం అని అంతా భావించారు.

అయితే వారిద్దరూ తాజాగా విడిపోతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ విషయాన్ని మైఖేల్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. అనుకోని పరిస్థితుల వలన మేమిద్దరం వ్యతిరేక మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. కాబట్టి మేమిద్దరం ఎవరి మార్గాల్లో వారు ప్రయాణించాలని నిర్ణయించుకున్నాం. కానీ శృతి హాసన్ కు నేను ఎప్పటికి బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటాను అంటూ మైఖేల్ శృతి హాసన్ తో కలసి ఉన్న ఫోటోని షేర్ చేశాడు. మొత్తానికి 2016 నుండి ప్రేమపక్షుల్లా లండన్ వీధుల్లో విహరించిన ఈ ప్రేమజంట కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో.. శృతిహాస‌న్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.