అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ భేటీ..కీలక ప్రకటన రానుందా?

PM Modi to meet CMs of all states

0
114

ప్రపంచ దేశాలను మాయదారి కరోనా వైరస్‌ గడగడలాడిస్తోంది. ఎప్పటికప్పుడు రూపాంతరాలు చెందుతూ ప్రజలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. డెల్టా వేరియంట్‌ రూపంలో భారత్‌లో సెకండ్‌ వేవ్‌ విధ్వంసమే సృష్టించగా ఇప్పుడు ఒమిక్రాన్‌ రూపంలో పంజా విసురుతోంది. ఇప్పటికే దేశంలో కరోనా థర్డ్‌ వే ప్రారంభమై పోయింది.

ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. వర్చువల్ పద్దతితో ఇవాళ సీఎంలతో భేటీ కానున్న ప్రధాని ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసులు, ఒమిక్రాన్‌ పరిస్థితి, కట్టడికి తీసుకుంటున్న చర్యలపై సమీక్షించనున్నారు. అలాగే ఏం చేస్తే బాగుంటుంది అనేదానిపై కూడా రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయనున్నారు ప్రధాని మోడీ.

ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ సమీక్ష సమావేశం కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రధాని ఎలాంటి ఆదేశాలు ఇవ్వనున్నారు. మరింత కఠినమైన ఆంక్షలు విధిస్తారా..? లాక్‌డౌన్‌ వైపు అడుగులు వేస్తారా? రాష్ట్రాలకే నిర్ణయాన్ని వదిలేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.