సుకుమార్ ఇంటికి రాజకీయ నాయకులు ఏం చేశారో తెలిస్తే షాక్

సుకుమార్ ఇంటికి రాజకీయ నాయకులు ఏం చేశారో తెలిస్తే షాక్

0
104

ఎన్నికల వేళ సినిమావారు రాజకీయ నాయకులతో పెద్ద ఎత్తున ప్రచారాల్లో పాల్గొంటారు అనేది తెలిసిందే ..ఎన్నికల్లో ఓట్ల కోసం రాజకీయ పార్టీలు ఇలాంటి స్టార్ క్యాంపెయినింగ్ చేస్తాయి.. ముఖ్యంగా ప్రజల్లో అలాగే అభిమానులను పెద్ద ఎత్తున సంపాదించుకున్న వారిని అందరిని మద్దతు కోసం ప్రచారాల్లో తీసుకువెళతారు. ఇక కొందరి ఇంటికి వెళ్లి నేరుగా తమకు సపోర్ట్ కావాలి అని కోరుతారు. తాజాగా ఇదే జరిగింది. సినీ దర్శకుడు సుకుమార్ను తెదేపా, జనసేన అభ్యర్థులు కలిశారు. తమకు మీ సపోర్ట్ కావాలి అని కోరారు. అయితే ఎన్నికల వేళ ఇది అంతా కామన్ అని అనుకునే నటులు, దర్శకులు కూడా ఉంటారు. కాని మీరు మాకు సపోర్ట్ చేయాలి అని వారు ఇరువురు కోరారు.

తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో మట్టపర్రులో తెదేపా తరఫున పోటీచేస్తున్న గొల్లపల్లి సూర్యారావు, జనసేన తరఫున పోటీ చేస్తున్న రాపాక వరప్రసాద రావు ఆయననను వేర్వేరుగా కలిశారు. తమ పార్టీకి మద్దతు పలకాలని కోరారు. అయితే దీనికి ఆయన సరేనని సమాధానం ఇచ్చారు అయితే సుకుమార్ ప్రస్తుతం తెలంగాణలో ఉంటున్నా ఆయన కుటుంబ సభ్యులు ఇక్కడ ఉంటున్న విషయం తెలిసిందే.