ఆర్కేకి షాకివ్వనున్న నారాలోకేష్

ఆర్కేకి షాకివ్వనున్న నారాలోకేష్

0
87

మంత్రిగా సీఎం కుమారుడిగా హేరిటేజ్ కంపెనీ బాధ్యతలు చూసుకున్న ఓ గొప్పవ్యాపారవేత్తగా రాజకీయ నేతగా ఆయనకు పేరు ఉంది. ఆయనే నారాలోకేష్.. ఇక నారాలోకేష్ రాజకీయంగా ఎలాంటి పరిస్దితి అయినా మేనేజ్ చేయగలరు అని పేరు తెచ్చుకున్నారు.గత ఎన్నికల మేనిఫెస్టోల్లో లోకేష్ పాత్ర అమోఘం , ముఖ్యంగా బాగా చదువు ఉండటంతో ఆయనకు రాజకీయాలు కూడా చాలా సులువు అయ్యాయి. ఐటీ మంత్రిగా ఎనలేని సేవ చేస్తున్నారు. ఇంత కష్టంతో కూడా ఏపీకి కంపెనీలు తీసుకువచ్చి, లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నారు. సౌకర్యాలు ఇచ్చి కంపెనీల ఏర్పాటు చేస్తున్నారు.

అమెరికాలోని స్ర్టాన్ఫోర్డ్ వర్సిటీలో ఎంబీఏ పూర్తిచేసిన లోకేశ్ 2009 నుంచి తండ్రి చంద్రబాబుకు సహకరిస్తున్నారు. ఎమ్మెల్సీగా ఉన్నందున లోకేశ్ ప్రత్యక్ష పోటీలో ఉండరని భావించినా ప్రతిపక్షానికి షాక్ ఇచ్చారు చంద్రబాబు, తాజాగా ఆయన్ను కూడా సీఎం ఎన్నికల బరిలో నిలిపారు. ఇక మంగళగిరి నుంచి ఆయన కచ్చితంగా 30 వేల మెజార్టీతో గెలుస్తారు అని, ఏ సర్వే చూసినా చెబుతోందట. ఇక ఆర్కే కూడా వైసీపీ తరపున గత ఎన్నికల్లో కేవలం 20 ఓట్ల కంటే తక్కువ మెజార్టీతో గెలిచారు ..ఈసారి లోకేష్ నేరుగా బరిలోకి ఉండటంతో ఆర్కేకి కచ్చితంగా ఓటమి తప్పదు అంటున్నారు ఇక్కడ జనం.