సినీ స్టార్స్ తో జగన్ కొత్త ప్లాన్

సినీ స్టార్స్ తో జగన్ కొత్త ప్లాన్

0
52

మొత్తానికి ఎన్నికల వేళ సినిమా నటులు కూడా పెద్ద ఎత్తున ప్రచారాల్లో పాల్గొంటారు అనేది తెలిసిందే. ఇప్పుడు ఏపీలో కూడా అలాంటి పరిస్దితి కనిపిస్తోంది రోజుకోకరు అయినా సినిమా నటులు రాజకీయ పార్టీల్లో చేరుతున్నారు పలానా పార్టీకి మా ప్రచారం చేస్తాం అంటు తెలియచేస్తున్నారు ఇటీవల కొందరు వైసీపీలో చేరడం తెలిసిందే ఇక తాజాగా వీరిలో ప్రముఖ సినీ నటులు అలీ, పోసాని కృష్ణ మురళీ నాయకత్వంలో వైసీపీలో రెండు టీమ్లు పనిచేస్తున్నాయట. ఎన్నికల స్టార్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు.

ఈ విషయాన్ని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పృథ్వీరాజ్ తెలియచే చేశారు. వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిని చేయడమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. సోమవారం నాడు బొబ్బిలి నుంచి ప్రచారం ప్రారంభిస్తామన్నారు.పేద ప్రజలకు సంక్షేమ పథకాలు చేరాలంటే రాజన్న రాజ్యం రావాలని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికే సినిమా నటులు పెద్ద ఎత్తున వైసీపీలో చేరుతున్నారు అని, వీరికి అందరికి పెద్ద ఎత్తున ప్రజల సపోర్ట్ కూడా ఉందని ,వైసీపీ నేతలు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా నిలబడిన నాయకులకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు అని వైసీపీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్న సినిమా స్టార్లు తెలియచేశారు.