ప్రధాని మోడీకి జగన్ లేఖ…

ప్రధాని మోడీకి జగన్ లేఖ...

0
95

విభజన చట్టంలో పొందుపరిచిన ప్రత్యేక హోదా అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే తెరపైకి తీసుకువస్తున్నారు… హోదాతోనే ఏపీ అభివృద్ది సాద్యం అని అన్నారు… వీలైనంత త్వరగా ఏపీకి హోదా ఇవ్వాలని జగన్ డిమాండ్ చేస్తూ ప్రధాని మోడీకి లేఖ రాశారు…

ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మోడీ జోక్యం అవసరం ఉందని లేదంటే ఏపీ ప్రజలు దురదృష్ట వంతులుగా మిగిలిపోతారని తెలిపారు… అలాగే కేంద్ర బడ్జెట్ ఏపీకి న్యాయం జరగకపోవడంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని తెలిపారు…

విభజన వల్ల తెలంగాణ రాష్ట్రమే ఎక్కువ లబ్ది పొందుతోందని అన్నారు… అర్థికంగా ఏపీ అనేక ఇబ్బందులు ఎదుర్కుంటోందని పేర్కొన్నారు… ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మోడీ జోక్యం అవసరం ఉందని అన్నారు జగన్… కాగా 14వ ఆర్థిక సంఘం సిఫారస్సుల మేరకు రాష్ట్రల కిచ్చే హోదాలను రద్దు చేస్తున్నట్లు 2016లో కేంద్రం ప్రకటించింది…