రాహుల్ గాంధీకి ప్రశాంత్ కిషోర్ సలహా అదిరిందట

రాహుల్ గాంధీకి ప్రశాంత్ కిషోర్ సలహా అదిరిందట

0
36

ఎన్నికల ప్రచారంలో వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ దేశంలో ఓ సూపర్ శక్తిగా అవతరించారు, ప్రశాంత్ కిషోర్ ఏ స్టేట్ లో నాయకులకి సలహాలు ఇస్తే ఆ నాయకులు ఆ పార్టీలు గెలుస్తాయి అనేలా మారిపోయింది.. అయితే తాజాగా ఆయన ఏపీలో జగన్ కు విజయం రావడానికి వెనుక వ్యూహాలు పన్నారు రాజకీయంగా ఆయన ఇచ్చిన సలహలు ఎన్నికల్లో బాగా లాభించాయి.

తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ కీలక సూచన చేశారు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర జాబితాకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనకు రాహుల్ మద్దతివ్వడం సంతోషకరమని పీకే అన్నారు. అయితే కాంగ్రెస్ రూలింగ్ లో ఉన్న స్టేట్స్ లో దీనిని పాటించం అని ఆయన ప్రకటన విడుదల చేయాలి అని కోరారు.

ఇలా చేస్తే అది మరింత పాజిటీవ్ అవుతుంది అని తన అభిప్రాయంగా తెలియచేశారు…ఎన్నార్సీని రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరించేందుకు ప్రయత్నించినా… కేంద్రం దాన్ని అమలు చేస్తుందని పార్లమెంటులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారని… ఆ ప్రకటన నిజమయ్యే అవకాశాలే లేవని పీకే అన్నారు. తాజాగా ఇలా చెప్పడం పై సర్వాత్రా అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.