ప్రధాని మోదీ దగ్గరకు చంద్రబాబు టీడీపీ సరికొత్త నిర్ణయం?

ప్రధాని మోదీ దగ్గరకు చంద్రబాబు టీడీపీ సరికొత్త నిర్ణయం?

0
82

సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేశారు అసెంబ్లీలో.. అయితే దీనిపై వైసీపీ నేతలు బాగానే ఉన్నారు.. జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు.. కాని చంద్రబాబు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. అసలు రాజధానికి ఆనాడు జగన్ ఎందుకు ఒకే చెప్పారు.. ఆనాడే వద్దు అని చెప్పాలి కదా, కుట్ర పూరితంగా చేస్తున్నారు జగన్ అని విమర్శలు చేస్తున్నారు.. ఒకవేళ అమరావతిలో రాజధాని ఉంచి పనులు కొనసాగించినా ఇక్కడ పేరు అంతా చంద్రబాబుకి వస్తుందనే కారణంతో, జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు అని తెలుగుదేశం విమర్శలు చేస్తోంది.

అయితే తాజాగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం పై చంద్రబాబు హస్తినకు వెళ్లనున్నారట.. ఇప్పటికే తెలుగుదేశం బీజేపీ మధ్య సయోధ్య లేదు. ఈ అంశాన్ని ప్రధాని మోదీ దగ్గరకు తీసుకువెళ్లాలి అని చంద్రబాబు భావిస్తున్నారట. సాక్ష్యాత్తూ వీరు వచ్చి ప్రారంభించిన అమరావతికి ఇప్పుడు జగన్ ఎండ్ కార్డ్ వేస్తున్నారు, మీరు సమస్య పరిష్కరించాలి అని కోరనున్నారట.

అయితే దీనిపై త్వరలో పార్టీ నేతలతో ఏపీ మేధావులతో చర్చించి చంద్రబాబు ప్రధానిని కలిసినా ఆశ్చర్యపోవక్కర్లేదు అంటున్నారు.. త్వరలో చంద్రబాబు ప్రధానిని కలిసే అవకాశం ఉంది అని వార్తలు కూడ వినిపిస్తున్నా