రాష్ట్రపతి ఎన్నికలు..తొలి రోజే 11 నామినేషన్లు

0
36

దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. ప్రెసిడెంట్ ఎలక్షన్ కు సంబంధించి ఎలక్షన్ కమిషన్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవాళ్టి నుంచి 29వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొంది. జులై 18వ తేదీన పోలింగ్, జులై 21న ఫలితాల విడుదల, జులై 25న నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

నోటిఫికేషన్ విడుదల చేసిన మొదటి రోజే 11 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. అయితే సరైన ద్రువపత్రాలు లేకపోవడంతో.. ఒకరి నామినేషన్ తిరస్కరించినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. నామినేషన్ దాఖలు చేసిన వారిలో బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఉన్నట్లు పార్లమెంటరీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, బుధవారం నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఢిల్లీ, బిహార్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెందిన వారు ఉన్నారు.