వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు వంగవీటి రాధా, ఈ సమయంలో వైసీపీ అధినేత జగన్ పై అనేక విమర్శలు చేశారు. అంతేకాదు సింగిల్ -నేను చేతకాని వాడిని అని అనుకున్నారు, నేను ఏమిటో చూపిస్తా జగన్ కు విజయం రాదు, ఆయన ఓటమి కోసం కష్టపడతా అని అనేక విమర్శలు చేశారు.. అయితే వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఆయన చేరుతారు అని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. అంతేకాదు దీనిని బలం చేకూర్చేలా తెలుగుదేశం నేతలు వరుసగా ఆయన ఇంటికి వెళ్లి చర్చలు జరుపుతున్నారు.
మరో పక్క కొడాలి నాని వైసీపీ తరపున ఆయన ఇంటికి వెళ్లలేదు అని, కేవలం స్నేహం ఉండటంతో నాని రాధా ఇంటికి వెళ్లారు అని తెలుస్తోంది. దీంతో నాని రాధా స్నేహితులు కాబట్టి రాజకీయ చర్చలు జరగలేదు అంటున్నారు.ఇక రాధాని తీసుకుని లగడపాటి సీఎం వద్దకు వెళ్లారు, సీఎం చంద్రబాబుతో చర్చలు జరిపారు. ఆయనకు స్పష్టమైన హామీ లభించింది. ఇక నరసరావుపేట లేదా అనకాపల్లి నుంచి ఎంపీ టికెట్ కావాలి అంటే ఇస్తాము అని బాబు హామీ ఇచ్చారు, అయితే రాధా మాత్రం ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తాను అని తెలియచేశారట.. ఇక మీ ఇష్టం ఈ నిర్ణయం మీకే వదిలేస్తున్నాను అని బాబు తెలియచేశారని, పార్టీ అధికారంలోకి వస్తే సముచిత స్ధానం ఇస్తాము అని బాబు స్పష్టమైన హామీ ఇచ్చారట.
Tdp 2019 win conform
Comments are closed.