రైలు ప్ర‌యాణికుల‌కి బ్యాడ్ న్యూస్ రైల్వే శాఖ కీల‌క ప్ర‌క‌ట‌న

రైలు ప్ర‌యాణికుల‌కి బ్యాడ్ న్యూస్ రైల్వే శాఖ కీల‌క ప్ర‌క‌ట‌న

0
34

మోదీ ఏం చెబుతారా అని అంద‌రూ ఎదురుచూశారు.. చివ‌ర‌కు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ లాక్ డౌన్ మే 3 వ‌ర‌కూ పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు, దీంతో ఇక ర‌వాణా సౌక‌ర్యాలు ఉంటాయి అని భావించిన వారికి పెద్ద షాక్ త‌గిలిన‌ట్టు అయింది.

తాజాగా మే 3 వరకూ అన్ని రైలు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. మే 3 వరకూ లాక్‌డౌన్ కొనసాగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన కాసేపటికే రైల్వే ఈ స్పష్టత ఇచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కూ రైలు రిజ‌ర్వేష‌న్ చేసుకున్న వారు అంద‌రూ కూడా షాక్ అయ్యారు.

వారి అమౌంట్ తిరిగి ఇచ్చెయ్య‌నుంది రైల్వే శాఖ‌. ప్యాసింజర్ రైళ్లు, ప్రీమియం రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, సబర్బన్ రైళ్లు, మెట్రో రైల్ సర్వీసులను పూర్తి స్థాయిలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక పండ్ల నిత్య అవ‌స‌ర వ‌స్తువులు ప‌ప్పులు ధాన్యాల‌కు మాత్రం కొన్ని గూడ్స్ రైళ్లు మాత్ర‌మే తిరుగుతాయి అని తెలుస్తోంది.