సీఎం జగన్ దేశంలోనే మరో రికార్డ్

సీఎం జగన్ దేశంలోనే మరో రికార్డ్

0
35

సీఎం జగన్ అప్రమత్తత వల్ల అతి తక్కువ ప్రాణనష్టం నమోదైన రాష్ట్రంగా ఏపీ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. వాలంటీర్లు, ఆరోగ్య కార్యకర్తల సేవలు రాష్ట్రాన్ని పెద్ద ఉపద్రవం నుంచి రక్షించాయని అన్నారు వాలంటీర్లు మూడుసార్లు ఇంటింటి సర్వే చేసి పౌరుల ఆరోగ్య చరిత్రను రికార్డు చేయడం గర్వించదగ్గ విషయం అని అన్నారు.

పాలనా దక్షత అంటే సిఎం జగన్ ని చూసి నేర్చుకోవాలని అన్నారు. అందరి సలహాలు తీసుకుంటూ అధికార యంత్రాంగానికి ఆదేశాలిస్తారని అన్నారు.. వాటిని అమలు చేసే స్వేచ్ఛ అధికారులకిచ్చారని తెలిపారు… పని జరగాలంతే. మీడియా ప్రచారం ఆయన అస్సలు కోరుకోరని అన్నారు. రాష్ట్రం బాగుంటే చాలని యువ సిఎం కోరుకుంటారని అన్నారు..

అలాగే ప్రజలకు పంపిణీ చేసే 16 కోట్ల మాస్కులు రాష్ట్రంలోని మహిళలే తయారు చేసారు. కుట్టు మిషన్లను ఆయుధాలుగా చేసి రేయింబవళ్లు కరోనాతో పోరాడుతున్న వారందరికీ ధన్యవాదాలని అన్నారు. సిఎం జగన్ పిలుపునందుకుని భారీ ఎత్తున మాస్కుల ఉత్పత్తి యజ్ఞంలో పాలు పంచుకున్నారని అన్నారు…