రాజధానిపై ప్రకటన అప్పుడు చేస్తాం మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాజధానిపై ప్రకటన అప్పుడు చేస్తాం మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

0
80

ఏపీలో మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చిన తర్వాత అధికార వైసీపీ పై తెలుగుదేశం జనసేన విమర్శలు చేస్తున్నారు రాజధాని తరలించడానికి వీలు లేదు అని రాజధాని రైతులు కూడా బీష్మించుకున్నారు మరోపక్క విశాఖ వాసులు రాజధాని ఎప్పుడు ప్రారంభిస్తారు అని ఎదురుచూస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే.. రాజధానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేస్తుందని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన ప్రకటనతో మరింత రాజధానిరైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు,

అమరావతి రాజధానా లేక గ్రామమా ? అని ప్రశ్నించారు. ప్రస్తుతం రాజధాని తయారీకి వందేళ్లు పడుతుందని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. పదిశాతం మంది ప్రజలకు మాత్రమే సచివాలయం, హైకోర్టుతో అవసరం ఉంటుందన్నారు. అందరూ రోజు అక్కడకు రారుకదా అని తెలియచేశారు, హైపవర్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత శాసనసభ సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం ప్రకటిస్తాం అన్నారు. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా ఫిబ్రవరిలో ఈ సమావేశం ఏర్పాటు చేస్తారు అని వార్తలు వస్తున్నాయి.