రామోజీ చంద్రబాబు భేటీ మూడు అంశాలు

రామోజీ చంద్రబాబు భేటీ మూడు అంశాలు

0
107

మొత్తానికి సీఎం చంద్రబాబు రామోజీరావుతో భేటీ కావడం పై ఇప్పుడు పెద్ద చర్చ అయితే జరుగుతోంది.. ఫలితాలకు ఆరు రోజుల ముందు ఎలాంటి విషయం పై వీరు చర్చించారు, ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు అనేది చర్చించారా అని కూడా చర్చ జరుగుతోంది, అసలు తెలుగుదేశం పార్టీకి రామోజీ రావు మద్దతుఉంది అని అంటారు అందరూ . అంతేకాదు జగన్ నేరుగా విమర్శలు కూడా వారిద్దరి పై చేస్తారు. ఇలా వైసీపీకి బద్ద శత్రువు మీడియాగా ఈనాడు ఉంది అని చెప్పాలి, మీడియా పోటీలో కూడా ఇద్దరూ ఉన్నారు,

అయితే రవిప్రకాష్ కు ఇప్పుడు వచ్చిన సమస్య తీర్చేందుకు చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు అని, అందుకే ఈనాడు మీడియా అధినేత రామోజీరావుతో చర్చలు జరిపారు అని సాక్షి వార్త ఇచ్చింది… తెలంగాణలో మైహోం రామేశ్వరరావుతో రామోజీరావుకు సాన్నిహిత్యం ఉందని.. దాన్ని అడ్డంపెట్టుకుని రవిప్రకాష్ ను రక్షించాలనేది చంద్రబాబు నాయుడి ఎత్తుగడ అని ‘సాక్షి’ పేర్కొంది. మరి ఇప్పుడు ఎటువంటి విషయం బయటకు రాకపోయినా కచ్చితంగా అందుకే భేటీ అయ్యారా అని చర్చించుకుంటున్నారు. అలాగే బాబు మళ్లీ ఎన్డీయే అధికారంలోకి వస్తే బీజేపీ నేతలతో వారికి దగ్గర అయ్యేందుకు రామోజీరావుతో కలిసి చర్చలు జరిపేందుకు వచ్చారా అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు కొందరు.