పదవి విరమణ పొందిన సీనియర్ ఐ.ఎఫ్.ఎస్ అధికారి

0
103

అటవీ శాఖలో వివిధ హోదాల్లో 33 ఏళ్ల పాటు పని చేసిన సీనియర్ ఐ.ఎఫ్.ఎస్ అధికారి స్వర్గం శ్రీనివాస్ ఇవాళ పదవీ విరమణ పొందారు. కరీంనగర్ జిల్లాకు చెందిన స్వర్గం శ్రీనివాస్ ఎం.ఎస్సీ పూర్తి చేసిన తర్వాత 1989లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కు ఎంపిన అయ్యారు.

ఆ తర్వాత అటవీ శాఖతో పాటు, డిప్యుటేషన్ పై వివిధ శాఖలో సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకుని పనిచేశారు. ప్రస్తుతం చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ తో పాటు అడ్మిన్, విజిలెన్స్ విభాగాలకు అధిపతిగా పీసీసీఎఫ్ హోదాలో పని చేస్తూ పదవీ విరమణ పొందారు.

తెలంగాణకు చెంది, పీసీసీసీఎఫ్ ర్యాంకులో రిటైర్డ్ అవుతున్న తొలి వ్యక్తిగా స్వర్గం శ్రీనివాస్ గుర్తింపు పొందారు. స్వర్గం శ్రీనివాస్ పదవీ విరమణ సందర్భంగా అరణ్య భవన్ లో పీసీసీఎఫ్, హెచ్ఓఓఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్ తో పాటు, ఇతర సీనియర్ అధికారులు, సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు. ఆయన సుదీర్ఘ సర్వీసులో తమకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు.