ప్రధాని నరేంద్ర మోడీని సూటిగా ప్రశ్నించిన రేవంత్ రెడ్డి..

0
106
revanth reddy

ప్రధాని నరేంద్ర మోడీకి టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాసాడు. అందులో రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని సూటిగా 9 ప్రశ్నలను సంధించాడు.

  • హైదరాబాద్ కు మీరు వస్తున్న సందర్బంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మీ దృష్టికి తెస్తున్నాను..మీది, టిఆర్ఎస్ వాళ్ళది ఫెవికాల్ జోడి అని మండిపడ్డాడు మీరంతా రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారు కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయడం లేదు..
  • రాష్ట్రంలో రైతులు, యువత, విద్యార్థి సమస్యలు మీరు పట్టించుకోవడం లేదు.. విభజన చట్టంలో ఉన్న అంశాలు ఏవి తెలంగాణ రాలేదు. రెండు ప్రభుత్వాల నిర్లక్ష్యంతో తెలంగాణ నష్టపోతోంది.
  • పైకి ఉప్పు నిప్పు ల ఉన్న పోరాటం చేస్తున్నట్టు కనిపించే మీరు లోపాయకారి ఒప్పందాలతో చీకటి రాజకీయాలు చేస్తున్నట్టు ఇప్పటికే తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు.
  • ప్రధాన మంత్రిగా పార్లమెంట్ లో మీరు తెలంగాణ ప్రజలను అవమాన పరిచే విదంగా మాట్లాడి తెలంగాణ ప్రజలను అవమాన పరిచారు.. ఆ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని వెనక్కు తీసుకోవాలి..
  • ప్రాణహిత చేవెళ్ల పథకం రీ డిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు పెట్టారు. పెద్దఎత్తున అవినీతి జరిగిందని మేం ఆరోపించాం.. మీ అధ్యక్షులు జెపి నడ్డా కాళేశ్వరం ప్రాజెక్టు కల్వకుంట కుటుంబానికి ఏటీఎం లా మారిందని ఆరోపించారు. మరి ఎందుకు విచారణ జరపడం లేదు.. మీ ఇద్దరి చీకటి స్నేహం అడ్డు పడుతుందా..
  • ఆర్మూర్ లో ఏర్పాటు చేస్తామన్న పసుపు బోర్డ్ ఏమైంది…ఐటీఐఆర్, కాజీపేట కోచ్ ఫాక్టరీ, బయ్యారం ఇనుము ఫ్యాక్టరీ ఏమైంది. ఐటీఐఆర్ రద్దు అయ్యింది.. కోచ్ ఫ్యాక్టరీ ఐరన్ ఫ్యాక్టరీ మహారాష్ట్ర కు తరలి పోయాయి..
  • ఒరిస్సా లోని నైని కోల్ మైల్ జరిగిన అక్రమాల విషయంలో ఎందుకు స్పందించడం లేదు. మీ చీకటి మిత్రుడు కేసీఆర్ బంధువులు అందులో ఉన్నారని మీరు స్పందించడం లేదా..
  • కృష్ణ నది జలాల విషయంలో తెలంగాణ కు అన్యాయం జరుగుతున్న, జగన్, కేసీఆర్ చీకటి స్నేహంతో తెలంగాణ కు నష్టం జరుగుతున్న మీరు పట్టించుకోవడం లేదు..విభజన చట్టంలోని తెలంగాణ కు రావాల్సిన గిరిజన యూనివర్సిటీ రాలేదు. ఒకరిపై ఒకరు చెపుతూ దాటవేస్తున్నారు.
  • వ్యవసాయ ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు ఏమైంది..రామాయణం సర్కూట్ లో భద్రాచలం ఎందుకు చేర్చలేదు. ఈ 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.