సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్

Rewanth Reddy challenges CM KCR

0
103

హైదరాబాద్​ ఇందిపార్క్​లోని ధర్నాచౌక్​లో కాంగ్రెస్​ తలపెట్టిన వరిదీక్షలో తెరాస ప్రభుత్వంపై పీసీసీ రేవంత్​రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కల్లాల్లో వడ్లు తడిసి మొలకెత్తుతున్నా.. కుప్పల మీదే రైతులు ప్రాణాలొదులుతున్నా.. ప్రభుత్వం ఎందుకు పట్టనట్టుంటోందని నిలదీశారు. రైతులకు మద్దతుగా రాత్రి దీక్షాస్థలిలోనే పడుకుంటామని స్పష్టం చేశారు.

మోదీ, కేసీఆర్‌ కలిసి ధాన్యం కొనకుండా రైతులను మోసం చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్​ ఇందిరాపార్క్​ ధర్నాచౌక్​లో కాంగ్రెస్​ చేపట్టిన వరిదీక్షలో పాల్గొన్న రేవంత్​రెడ్డి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వ్యవసాయం దండగ కాదు పండుగ చేస్తా అన్న కేసీఆర్​..ఇప్పుడు ధాన్యం ఎందుకు కొనుగోలు చేయట్లేదని నిలదీశారు.

పదివేల కోట్లు కాంగ్రెస్​ ప్రభుత్వానికి ఇస్తే.. రాష్ట్రంలో పండిన ప్రతీ గింజ కొనుగోలు చేస్తామని రేవంత్​ పేర్కొన్నారు. దానితో పాటు రూ. 500 బోనస్​ కూడా ఇచ్చి చూపిస్తామన్నారు. ఒక వేళ అలా చేయలేని పక్షంలో ఓట్లు అడగబోమని ప్రభుత్వానికి సవాల్​ విసిరారు.