జగన్ క్యాబినెట్ లో రోజాకి కీలక పదవి

జగన్ క్యాబినెట్ లో రోజా కి కీలక పదవి

0
46

ఏపీలో జగన్ మోహాన్ రెడ్డి చరిత్రత్మక విజయం తరువాత ఇప్పుడు అందరి దృష్టీ కేబినెట్‌లో ఎవరికి అవకాశం కల్పిస్తారనే దానిపైనే ఉంది. ముందు నుంచి పార్టీకి 126 స్థానాలు వస్తాయని అంచనా వేసిన జగన్ అనూహ్యంగా 151 స్థానాలు గెలుచుకోవడంతో ఇప్పుడు కేబినేట్ కూర్పు అనేది చాలా కష్టతరంగా మారిందని భావిస్తున్నారు పార్టీ నేతలు. ముఖ్యంగా కేబినెట్‌లో అన్ని వర్గాల వారికీ సమాన ప్రాధాన్యం ఇస్తూ కేబినెట్ కూర్పు చేయాలని జగన్ భావిస్తున్నట్లు తెలిసింది. తనతో కలిపి మొత్తం 26 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.

తనను పక్కన పెడితే… మరో 25 మందికి తొలి కేబినెట్‌లో స్థానం కల్పించాలని జగన్ లెక్కలేసినట్లు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కించూ కోవాలని ఆ పార్టీ లోని సీనియర్,జూనియర్ నాయకులు సైతం భారీ అంచనాలే పెట్టుకున్నారు. అలాగే ఓ వైపు సీనియర్లు మరో వైపు జూనియర్లు ఇద్దరూ కూడా భారీ సంఖ్యలో గెలవడంతో మంత్రివర్గ కూర్పు జగన్ కు అంత ఈజీ కాదనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.. ఇకపోతే రోజా పరిస్థితి ఏమిటనే దానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మరోవైపు ఆమెకు స్పీకర్ పదవి ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నారనే వార్తలు కూడా రాజకీయవర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇది ఓకే అయితే ఎపి లో సరికొత్త స్పీకర్ గా రోజా ని చూడొచ్చు..