సాహూ టీజర్ రిలీజ్ ఆ రోజే

సాహూ టీజర్ రిలీజ్ ఆ రోజే

0
71

‘బాహుబలి’ తరువాత ప్రభాస్ కెరియర్లోనే అత్యధిక బడ్జెట్ తో ‘సాహో’ రూపొందుతోంది. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియోలను వదిలారుగానీ టీజర్ ను మాత్రం రిలీజ్ చేయలేదు.

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 5వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను విడుదల చేయనున్నారు. టీజర్ తోనే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అందువలన ఈ మూడు భాషలకి చెందిన ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.