సమంత ఓ బేబీ రిలీజ్ డేట్ ఖరారు..!!

సమంత ఓ బేబీ రిలీజ్ డేట్ ఖరారు..!!

0
58

సమంత ప్రధాన పాత్రధారిగా నందినీ రెడ్డి దర్శకత్వంలో ‘ఓ బేబీ’ రూపొందింది. కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి ఇది రీమేక్. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లక్ష్మి .. రాజేంద్ర ప్రసాద్ .. నాగశౌర్య ముఖ్యమైన పాత్రలను పోషించారు.

తాజాగా ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేశారు. జూలై 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. 60 ఏళ్ల వృద్ధురాలి ఆత్మ 20 ఏళ్ల యువతిని ఆవహించడం .. అందుకుగల కారణాలు .. ఆ తరువాత చోటుచేసుకున్న పరిణామాలతో కథ అనూహ్యమైన మలుపులు తిరుగుతూ సరదాగా సాగుతుందన్న మాట. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో, సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.