బాబుపై దారుణమైన ట్వీటెట్టిన సాయిరెడ్డి

బాబుపై దారుణమైన ట్వీటెట్టిన సాయిరెడ్డి

0
88

తెలుగుదేశం పార్టీపై నిత్యం విమర్శలు ఆరోపణలు చేస్తారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా విపక్షంలో ఉన్నా టీడీపీ పై టార్గెట్ అదే రేంజ్ లో ఉంటుంది.. ఇఫ్పుడు వైసీపీ అధికారంలో ఉండటం, తెలుగుదేశం పార్టీలో ఎలాంటి మార్పు రాకపోవడం, ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ట్వీట్ యుద్దం నడుస్తోంది అని చెప్పాలి, ఈ సమయంలో భవన నిర్మాణ కార్మికుల కోసం ఇసుక దీక్ష చేశారు బాబుగారు దీనిపై వైసీపీ ఎంపీ సాయిరెడ్డి దారుణమైన ట్వీటెట్టారు.

ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి, ఎన్టీఆర్ విగ్రహానికి దండేశాడు. ప్రభుత్వం సాండ్ వెబ్సైటు ని హాక్ చేయించి కృత్రిమ ఇసుక కొరత సృష్టించి ఇసుక పై నిరసన దీక్ష చేస్తున్నాడు. ఆయనంతే, జనం ఛీ కొట్టినా మారడు అంతే అంటూ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో సై రా పంచ్ వేశారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ నుంచి నేతలు ఒక్కక్కరు బయటకు రావడంతో ఇఫ్పుడు చంద్రబాబు ఏమీ చేయలేని పరిస్దితిలో ఉన్నారు.. ఈ సమయంలో తమ అధినేతపై ఇలా విమర్శలు చేస్తే ఊరుకోము అని, టీడీపీ కూడా వైసీపీ పై మీడియా ముఖంగా ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు ఆరోపణలు చేస్తోంది.